అన్నదాతల సమస్యలు చెప్పేందుకు ‘రైతన్న’ తీశాను: ఆర్‌.నారాయణమూర్తి - rnarayanamurthy about raithanna movie at ravindrabharathi
close
Published : 10/08/2021 21:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నదాతల సమస్యలు చెప్పేందుకు ‘రైతన్న’ తీశాను: ఆర్‌.నారాయణమూర్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న చట్టాలతో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడానికే ‘రైతన్న’ సినిమా తీశానని ఆర్.నారాయణమూర్తి తెలిపారు. ఆయన దర్శకత్వం వహించి, నటించిన చిత్రం ‘రైతన్న’. ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభినందన సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కిసాన్‌ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తిని కోట్లాది మంది రైతులు అభినందిస్తున్నారని ఆయన అన్నారు. నారాయణమూర్తి సినిమాలంటేనే సమాజానికి ఉపయోగపడే సినిమాలుగా పేరొందాయని కోదండరెడ్డి పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతన్న పేరుతో సినిమా తీయడం అభినందనీయమన్నారు. ఈ ఒక్క సినిమాతోనే రైతాంగ సమస్యలు పరిష్కారం కావని, దీనికి కొనసాగింపుగా రైతన్న 1, 2 భాగాలుగా తీయాలని కోదండరెడ్డి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాల వల్ల జరిగే ఆర్థిక ఇబ్బందులతో రైతాంగం ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతోందని కోదండరెడ్డి అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని