‘క్యాష్‌’లో రాఖీ స్పెషల్‌.. సందడి చేసిన అక్కా-తమ్ముళ్లు.. అన్నా-చెల్లెళ్లు.. - rakhi special cash latest promo pandu saketh jaffer bhanu sri
close
Published : 16/08/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్యాష్‌’లో రాఖీ స్పెషల్‌.. సందడి చేసిన అక్కా-తమ్ముళ్లు.. అన్నా-చెల్లెళ్లు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి పండగకు ప్రేక్షకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించే ‘ఈటీవీ’ ఈసారి కూడా వినోదాల విందు ఇచ్చేందేందుకు సిద్ధమైంది. రాబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా ‘క్యాష్‌’ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తగ్గేదేలే అంటోంది. రాఖీ సందర్భంగా ఈ కార్యక్రమంలో అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు సందడి చేయనున్నారు. డ్యాన్సర్‌ పండు, సింగర్‌ సాకేత్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ జాఫర్‌, భానుశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూర్తి కార్యక్రమం వచ్చే శనివారం(21ఆగస్టు) రాత్రి 9.30గంటలకు ప్రసారం కానుంది.

వేదిక మీదకి వచ్చీరావడంతోనే తమ సోదరుల చేతికి రాఖీ కట్టారు. ‘నాకో కోరిక.. మీకు రాఖీ కట్టాలని ఉంది’ అని సుమను ఉద్దేశిస్తూ భానుశ్రీ సరదాగా అనగా.. మరి ‘నిన్ను బ్రదర్‌ అని పిలవాల్సి వస్తుంది’ అని సుమ కౌంటర్‌ ఇచ్చింది. సుమను ఇంటర్వ్యూ చేసేందుకు జాఫర్‌ పెద్ద ప్రశ్నల చిట్టా రాసుకొచ్చాడు. దాన్ని చూసిన సుమ షాకై.. ఇంత పెద్దగా ఉంది.. టాయిలెట్‌లో కూర్చొని రాశారా..? టిష్యూ పేపర్‌ మీద రాసుకొచ్చారు అని తనదైన స్టైల్‌లో పంచ్‌ వేయడంతో అందరూ పగలబడి నవ్వారు. సమయం దొరికినప్పుడల్లా పండు వెళ్లి సాకేత్‌ వాళ్ల సోదరికి, భానుశ్రీకి లైన్‌ వేస్తూ ఉండటం.. మధ్యలో సుమ కల్పించుకొని ‘హలో.. ఇది ఎవరి చెల్లెలితో వాళ్లు పాల్గొనే కార్యక్రమం.. వేరే వాళ్ల చెల్లెలితో పాల్గొనే కార్యక్రమం కాదు’ అంటూ సర్ది చెప్పి తన పోడియం దగ్గరికి పంపించడం.. ఇలా  సరదాగా సాగింది. ఆ తర్వాత అమ్మాయిలతో రాఖీ తనకు కట్టించడంతో పండు పాపం బిక్కమొహం వేశాడు. ఆఖర్లో ఎమోషనల్‌ టచ్‌తో కార్యక్రమ ప్రోమో ఆకట్టుకునేలా ఉంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని