డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..! - nadiyon paar let the music play again roohi janhvi
close
Published : 03/03/2021 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి వచ్చిన జాన్వీకపూర్‌.. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. 2018లో తెరంగేట్రం చేసిన ఈ చిన్నది కథల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తోంది. అందుకే ఆమె సినిమాలు కమర్షియల్‌గానూ విజయాలు సాధిస్తున్నాయి. జాన్వీ కూడా తన అందం, అభినయంతో అందరి చేత శెభాష్ అనిపించుకుంటోంది. ఇక ఆమె డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటిస్తున్న ‘రూహి’ చిత్రం నుంచి తాజాగా ఓ పాట విడుదలైంది. అందులో జాన్వీ అదిరిపోయేలా స్టెప్పులేయడంతో పాటు హావభావాల్లోనూ తన తల్లిని గుర్తు చేసింది. ఈ పాటలో జాన్వీని చూస్తుంటే ‘మిస్టర్‌ ఇండియా’ చిత్రంలో ‘హవా హవాయి’ పాటలో శ్రీదేవిని చూస్తున్నట్లే ఉందని అభిమానులు పోలుస్తున్నారు. రెండు పాటల్లోనూ తల్లి, కూతురు ధరించిన దుస్తులు ఒకేలా ఉండటంతో అచ్చం శ్రీదేవిని చూసినట్లే అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

కామెడీ హర్రర్‌ చిత్రంగా ‘రూహి’ని డైరెక్టర్‌ హార్దిక్‌ మెహతా తెరకెక్కిస్తున్నారు. హనీమూన్‌కు వెళ్లిన ఓ కొత్త జంటను దెయ్యం ఆవహించే నేపథ్యంలో ఈ సినిమాను తీర్చిదిద్దారు. రాజ్‌కుమార్‌రావు, జాన్వీకపూర్‌ జంటగా కనిపించనున్నారు. వరుణ్‌శర్మ, అలెక్స్‌ ఒనెల్‌ కీలక పాత్రలు పోషించారు. దినేశ్‌ విజన్‌ నిర్మాత. సచిన్‌ జిగర్‌ సంగీతం అందించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని