‘బాహుబలి’ పాటతో సెన్సేషనలయ్యాడు..
close
Updated : 29/05/2020 11:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బాహుబలి’ పాటతో సెన్సేషనలయ్యాడు..

ప్రశంసిస్తున్న నెటిజన్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రియులను అలరించిన విషయం తెలిసిందే. కీరవాణి స్వరాలు అందించిన ఈ సినిమాలోని పాటలు సంగీత ప్రియులను మరెంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ‘బాహుబలి’ చిత్రంలోని పాట పాడి ఓ సాధారణ వ్యక్తి ఇంటర్నెట్‌లో సెన్సేషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం అతను పాడిన పాట నెట్టింట్లో వైరల్‌గా మారింది.

చందన్‌ కుమార్‌ గుప్తా అనే యువకుడికి సంగీతమంటే అమితమైన అభిమానం. ఇంజినీరింగ్‌ చదివిన అతను ప్లేబ్యాక్‌ సింగర్‌గా మారేందకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ‘బాహుబలి’ చిత్రంలో కైలాష్‌ ఖేర్‌ పాడిన ‘ఎవరంట ఎవరంట’ పాటను చందన్‌ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను అతని స్నేహితులు నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. దీంతో అతి కొద్ది సమయంలోనే చందన్‌ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ దాదాపు 5.9 మిలియన్ల మంది ఆ వీడియోను వీక్షించగా.. 15 వేల మంది కామెంట్లు పెట్టారు. ‘మీ వాయిస్‌ అద్భుతంగా ఉంది. మీలో మంచి టాలెంట్‌ ఉంది. పాడిన విధానం చూస్తుంటే మీకు ఆ పాట మీద ఉన్న అభిమానం తెలుస్తోంది. అద్భుతం, సూపర్‌’ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.

కాగా, తాజాగా చందన్‌ మాట్లాడుతూ.. ‘నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. సంగీతంలో కొంతమేర శిక్షణ తీసుకున్నా. ప్రస్తుతానికి తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో ప్లేబ్యాక్‌ సింగర్‌గా ప్రయత్నిస్తున్నా. ఉస్తాద్ ర‌షీద్, నుస్రత్ ఫ‌తే అలీఖాన్, కైలాష్ ఖేర్‌లు అంటే అభిమానం ఉంది.’ అని తెలిపారు.


 
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని