టాప్‌ 25 చిత్రాల్లో ఇది తప్పక ఉంటుంది
close
Published : 07/05/2020 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్‌ 25 చిత్రాల్లో ఇది తప్పక ఉంటుంది

‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ గురించి చిరు మాట

హైదరాబాద్‌: ఈ తరం, ఆ తరం అనే తేడా లేకుండా అన్ని తరాల వారు చూడదగిన ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అద్భుత సృష్టిలో తెరకెక్కిన ఈ సినిమా 1990లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దేవకన్యగా శ్రీదేవి పలికించిన హావభావాలతోపాటు చిరంజీవి నటన, డ్యాన్స్‌ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇళయరాజా అందించిన సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మే 9తో ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలైన సందర్భంగా సదరు క్లాసిక్‌ మూవీకి సంబంధించిన మూడు ఆసక్తికర విషయాలను నాని వాయిస్‌ ఓవర్‌తో మూడు రోజులపాటు విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ప్రకటించింది.

కాగా, తాజాగా  చిరు ఓ ప్రత్యేక వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం విడుదలై 30 సంవత్సరాలైన సందర్భంగా ఆ సినిమాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సినిమా అనేది సమష్ఠి కృషి అని చెప్పడానికి ఇదే సరైన ఉదాహరణ. ప్రతిఒక్కరూ తమ ప్రతిభను కనబరిచి ఈ చిత్రాన్ని ఓ క్లాసిక్‌గా మలచారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్‌ 25 చిత్రాల్లో ఈ సినిమాకి తప్పకుండా ఓ చోటు ఉంటుంది. ఇది టైమ్‌లెస్‌ మూవీ. ఆ తరం, ఈ తరం అని లేకుండా అందరూ చూడదగిన ఎవర్‌ క్లాసిక్‌ మూవీ. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం దక్కడం నా నట జీవితంలో ఓ అదృష్టంగా భావిస్తున్నాను’ అని చిరు పేర్కొన్నారు.

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని