నాని చెప్పనున్న చిరు సినిమా విశేషాలు
close
Published : 04/05/2020 11:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాని చెప్పనున్న చిరు సినిమా విశేషాలు

‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి 30 యేళ్లు

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు చిరంజీవి చిత్రానికి సంబంధించిన విశేషాలను యువ కథానాయకుడు నాని వెల్లడించనున్నారు. చిరంజీవి కథానాయకుడిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన క్లాసిక్‌ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. శ్రీదేవి కథానాయిక. 1990లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టి సూపర్‌ హిట్‌ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. 

కాగా, మే9 నాటికి ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఓ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. ‘జగదేకవీరుడు...’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ బయటకురాని ఎన్నో ఆసక్తికర విశేషాలను నానితో చెప్పించనున్నారు. ఈ మేరకు నాని మే 5, 7, 9 తేదీల్లో ఈ చిత్రానికి సంబంధించిన మూడు ఆసక్తికర విశేషాలను బయట పెట్టనున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని