నా జీవితంలో మరపురాని రోజు: దర్శకేంద్రుడు
close
Published : 28/04/2020 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా జీవితంలో మరపురాని రోజు: దర్శకేంద్రుడు

‘అడవి రాముడు’ ఆహా.. ‘బాహుబలి’ సాహో..!

హైదరాబాద్‌: ఏప్రిల్‌ 28.. తన జీవితంలో ఓ మధుర జ్ఞాపకమని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గుర్తుచేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అడవిరాముడు’ సినిమా ఈ తేదీన విడుదలైంది. ఆయన సమర్పించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్‌బస్టర్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో తన భావాల్ని పంచుకుంటూ రాఘవేంద్రరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఏప్రిల్‌ 29 నా జీవితంలో.. ఓ మరపురాని రోజు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారితో నా సినిమా ప్రస్థానం మరో మెట్టు ఎక్కినరోజు. సినీ ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి, కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్ర సృష్టించిన రోజు. ఆ నందమూరి ‘అడవి రాముడి’ని మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఆ సినిమా నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, పంపిణీ దారులకు, ఎగ్జిబిటర్లకు ఆ చిత్ర దర్శకుడిగా.. నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’.

‘‘అడవి రాముడు’ 4 సెంటర్లలో ఒక సంవత్సరంపాటు, 8 సెంటర్లలో 200 రోజులు, 35 థియేటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడటమే కాకుండా నెల్లూరు కనక మహల్‌ థియేటర్‌లో ప్రతిరోజు 5 షోలతో 100 రోజులు ఆడటం మరో విశేషం. అలా ఈ చిత్రం రికార్డుల రాముడిగా మారింది. బంగారానికి తావి అబ్బినట్లు ఏప్రిల్‌ 28 నాడే నా సమర్పణలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం విడుదల కావడం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ‘అడవి రాముడు’ ఆహా అనిపిస్తే.. ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా సాహో అనిపించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి, శోభూ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని తదితర నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. రెండు పండగలని ఒకేరోజు అందించిన ఏప్రిల్‌ 28.. కరోనా మహమ్మారిని తుద ముట్టించడానికి వేదికగా మారాలని ఆశిస్తూ.. అదే నిజమైన వేడుక అని భావిస్తూ.. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్న వైద్య సిబ్బందికి, పోలీసు విభాగానికి, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు చెబుతున్నా’ అని దర్శకేంద్రుడు ప్రేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని