ప్రభాస్‌తో మాట్లాడే అవకాశం రాలేదు: తమన్నా
close
Published : 24/04/2020 20:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌తో మాట్లాడే అవకాశం రాలేదు: తమన్నా

ముంబయి: ‘రెబల్‌’ సినిమా సెట్‌లో ప్రభాస్‌తో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదని కథానాయిక తమన్నా చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆమె ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ తమన్నాను వీడియో కాల్‌ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. ‘ప్రభాస్‌తో ‘బాహుబలి’ కోసం పనిచేశారు, అంతకుముందు ‘రెబల్‌’లో కలిసి నటించారు. రెండు విభిన్నమైన పాత్రలు. మీ అనుభవం ఏంటి?’ అని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘‘రెబల్‌’ సెట్‌లో తొలిసారి ప్రభాస్‌ను కలిశా. అప్పుడు అతడితో అంతగా మాట్లాడే అవకాశం రాలేదు. కానీ ‘బాహుబలి’ సినిమా సమయంలో మంచి స్నేహితులమయ్యాం. ఎందుకంటే ప్రభాస్‌ ఈ సినిమా కోసం చాలా సమయం కేటాయించారు. మిగిలిన చిత్రాలతో పోలిస్తే ఇది ప్రత్యేకం. నటీనటులందరికీ విభిన్నమైన అనుభూతి. ఎంతో ఎమోషన్‌తో కూడిన ప్రయాణం. ప్రభాస్‌ అనేక రకమైన పాత్రల్లో నటించారు. నాకు కూడా విభిన్నమైన పాత్రల్లో చేయాలని ఉంది. నటిగా నన్ను నేను వృద్ధి చేసుకోవాలి అనుకుంటున్నా’ అని చెప్పారు.

అనంతరం తెలుగులో తన తర్వాతి సినిమా ‘సీటీమార్‌’ గురించి ప్రశ్నించగా.. ‘ఇది కబడ్డీ సినిమా. ఇందులో నేను కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నా. తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నా. సంపత్‌ నంది దర్శకుడు. ఆయనతో ఇప్పటికే ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమాల కోసం పనిచేశా. విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఓ దర్శకుడిగా ఆయన, నటిగా నేను చాలా ఉత్సుకతగా ఉన్నాం’ అని తమన్నా చెప్పారు. ‘సీటీమార్‌’ సినిమాలో గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భూమిక, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, అజయ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని