కిలికి భాష నేర్చుకోవాలనుకుంటున్నారా?
close
Published : 21/02/2020 20:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కిలికి భాష నేర్చుకోవాలనుకుంటున్నారా?

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాలో ప్రభాస్‌ యాక్షన్‌, రాజమౌళి టేకింగ్‌ ఎంతగా అలరించాయో అదే స్థాయిలో ఆకట్టుకుంది కాలకేయుల కిలికి భాష. క్లైమాక్స్‌లో కాలకేయ నాయకుడిగా ప్రభాకర్‌ పలికిన సంభాషణలు మనకు నవ్వు తెప్పిస్తాయి. అయితే, అలాంటి భాష నిజంగానే ఉంది. అందుకు డాక్టర్‌ మదన్‌ కార్కే ఎంతో పరిశోధన చేసి ఆ భాషకు అక్షర రూపం ఇచ్చారు. 

కిలికి భాషను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఇప్పుడు మరో ముందడుగు వేశారు డాక్టర్‌ మదన్‌ కార్కే. 2013 నుంచి ఈ భాషపై పరిశోధన చేస్తున్న ఆయన 22 అక్షరాలతో వర్ణమాలను కూడా తయారు చేశారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా కిలికి భాషను ఎవరైనా నేర్చుకోవచ్చు.

కిలికి వెబ్‌సైట్‌ కోసం క్లిక్‌ చేయండి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని