శ్రీదేవి మరణానికి కారణం ఇదేనట!
close
Published : 04/01/2020 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీదేవి మరణానికి కారణం ఇదేనట!

బయోగ్రఫీలో పేర్కొన్న రచయిత

ముంబయి: 2018 ఫిబ్రవరి 24న అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త దేశాన్ని షాక్‌కు గురి చేసింది. బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్‌ వెళ్లిన ఆమె హోటల్‌ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తుపడి మృతి చెందారు. ఆమె హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగారు. అయితే శ్రీదేవి మరణానికి అసలు కారణం ఏంటనే సందేహాలు ఉన్నాయి. ఇటీవల సత్యార్థ్‌ నాయక్‌ అనే రచయిత శ్రీదేవి బయోగ్రఫీ రాసిన సంగతి తెలిసిందే. అందులో శ్రీదేవి మరణానికి కారణం ఏంటో చెప్పారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు, సన్నిహితుల వద్ద సమాచారం సేకరించారు.

ఈ సందర్భంగా ఆంగ్ల మీడియాతో సత్యార్థ్‌ మాట్లాడుతూ.. ‘శ్రీదేవికి రక్తపోటు సమస్య ఉందని ‘చాల్బాజ్‌’ దర్శకుడు పంకజ్‌ పరాషర్‌, నాగార్జున నాతో చెప్పారు. గతంలో తమతో కలిసి సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో ఆమె బాత్‌రూమ్‌లో కళ్లుతిరిగి కిందపడ్డారని అన్నారు. ఆ తర్వాత శ్రీదేవి మేనకోడలు మహేశ్వరిని కలిశా. ఓసారి శ్రీదేవి బాత్‌రూమ్‌లో పడిపోయారని, ఆమె ముఖానికి గాయమై, రక్తం వచ్చిందని చెప్పారు. వాకింగ్‌లో పలుమార్లు శ్రీదేవి కుప్పకూలిపోయిందని బోనీ కపూర్‌ తెలిపారు. నేను రాసినట్లే ఆమె తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నారు’ అని పేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని