ఆ సినిమా నా బ్యాడ్‌లక్‌
close
Published : 26/01/2020 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సినిమా నా బ్యాడ్‌లక్‌

నటిగా తానేంటో నిరూపించుకుంటానన్న శ్రీదేవి

ఇంటర్నెట్‌డెస్క్‌: అలనాటి అందాల తార శ్రీదేవి 1983లో నటించిన చిత్రం ‘హిమ్మత్‌వాలా’. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో శ్రీదేవి బాలీవుడ్‌లో ఓవర్‌నైట్‌ స్టార్ అయిపోయారు. ఇందులో జితేంద్ర, శ్రీదేవి జంటగా నటించారు. అయితే ఈ సినిమా తన జీవితంలో బ్యాడ్‌ లక్‌ తెచ్చిపెట్టిందని శ్రీదేవి ఒకానొక సందర్భంలో అభిప్రాయపడ్డారు. 1987లో శ్రీదేవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

‘తమిళ చిత్రాల్లో నా నటన సహజంగా ఉండాలని దర్శకులు, అభిమానులు అభిప్రాయపడేవారు. కానీ హిందీ చిత్రాల్లో అలా కాదు. వారికి కేవలం గ్లామర్‌ పాత్రలు మాత్రమే కావాలి. నా బ్యాడ్‌ లక్‌ ఏంటంటే.. నేను బాలీవుడ్‌ పరిశ్రమలో అడుగుపెట్టాక ‘హిమ్మత్‌వాలా’తో తొలి విజయం అందుకున్నాను. అది కమర్షియల్‌ హిట్‌ అందుకున్న చిత్రం. ఆ తర్వాత ‘సద్మా’ చిత్రంలో నాది డీగ్లామర్‌ పాత్ర. కానీ ఈ సినిమా ఫ్లాపైంది. దాంతో బాలీవుడ్‌ దర్శకులు నన్ను కేవలం గ్లామర్‌ పాత్రలకు మాత్రమే పరిమితం చేసేశారు. కానీ ఏదో ఒక రోజు నటిగానూ నేనేంటో నిరూపించుకుంటాను’ అని అప్పట్లో శ్రీదేవి వెల్లడించారు. ఈ విషయాన్ని శ్రీదేవి బయోగ్రఫీగా వచ్చిన ‘శ్రీదేవి: ది క్వీన్‌ ఆఫ్‌ హార్ట్స్‌’లోనూ రచయిత పేర్కొన్నారు.

ఆ తర్వాత 2013లో ఈ చిత్రానికి రీమేక్‌గా ‘హిమ్మత్‌వాలా’ అనే మరో సినిమా వచ్చింది. ఇందులో అజయ్‌ దేవగణ్‌, తమన్నా జంటగా నటించారు. సాజిద్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని