మాహిష్మతిలో ఉన్నా మాస్క్‌ ధరించాల్సిందే!
close
Published : 27/06/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాహిష్మతిలో ఉన్నా మాస్క్‌ ధరించాల్సిందే!

వీడియో వైరల్‌

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క కీలక పాత్రల్లో నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.1000కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మాహిష్మతి సామ్రాజ్యం, యాక్షన్‌ సన్నివేశాలు ఇలా ‘బాహుబలి’ని రాజమౌళి ఓ విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దారు.

కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మాస్క్‌ ఆవశ్యకతను తెలియజేసేలా, ‘బాహుబలి2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌, రానాలు మాస్క్‌లు ధరించి పోరాడుతున్నట్లు రూపొందించిన వీడియోను రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు. ఒక వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో టీమ్‌ తయారు చేసిన ఈ వీడియోను షేర్‌ చేస్తూ, వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ భద్రంగా ఈ విధంగా నిబంధనలు పాటిస్తారని భావిస్తున్నా’ అని జక్కన్న పేర్కొన్నారు. ‘మాహిష్మతిలో ఉన్నా ప్రస్తుతం మాస్క్‌ తప్పనిసరి మర్చిపోవద్దు’ అని వీడియోలో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా ఆకట్టుకుంటోంది.

మరోవైపు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడటంతో తిరిగి షెడ్యూల్‌ను ఎలా ప్రారంభించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని