ప్రతిసారీ 160 కిలోలు మోయాల్సివచ్చేది..!
close
Updated : 13/06/2020 11:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతిసారీ 160 కిలోలు మోయాల్సివచ్చేది..!

‘అరణ్య’ క్లిష్టమైన చిత్రం: రానా

హైదరాబాద్‌: ‘అరణ్య’ తన కెరీర్‌లోనే అతి క్లిష్టమైన సినిమా అని నటుడు రానా దగ్గుబాటి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా ఏనుగుల సంరక్షకుడిగా, ఓ ఆదివాసీ పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా గురించి రానా స్పందించారు. ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదని చెప్పారు.

‘‘బాహుబలి’ సినిమా నా జీవితాన్ని మార్చడంతోపాటు భారతీయ సినిమా స్థాయినీ పెంచింది. సినిమా విషయంలో ప్రతి ఒక్కరికీ ఉన్న ఆలోచనలను మార్చింది. సినిమా తెరకెక్కించే విధానంలో సైతం ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ సినిమా తర్వాత నేను నటించిన విభిన్న కథా చిత్రం ‘అరణ్య’. అయితే ఇప్పటివరకూ నేను నటించిన సినిమాల్లో ‘అరణ్య’ ఎంతో క్లిష్టమైనది. ఏనుగు తొండం బరువును ప్రతిసారీ నా భుజాలపై మోయాల్సివచ్చేది. ఆ బరువు దాదాపు 160, 170 కిలోలు ఉంటుంది. నేను నటించిన ప్రతి సినిమా నా జీవితానికి ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చింది.’ అని రానా పేర్కొన్నారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అరణ్య’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో విష్ణువిశాల్‌, పుల్‌కిత్‌ సామ్రాత్‌, జోయా హుస్సేన్‌ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 2వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని