తన వయసెంతో చెప్పేసిన రష్మీ..? ప్రదీప్‌, సుధీర్‌ కౌంటర్లు.. అలరిస్తున్న ‘ఢీ13’ ప్రోమో - dhee 13 latest promo kings vs queens
close
Updated : 14/08/2021 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తన వయసెంతో చెప్పేసిన రష్మీ..? ప్రదీప్‌, సుధీర్‌ కౌంటర్లు.. అలరిస్తున్న ‘ఢీ13’ ప్రోమో

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతివారం కళ్లు చెదిరే డ్యాన్సులతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీతో అలరించే ‘ఢీ’ వచ్చేవారం రెట్టింపు సందడి చేసేందుకు సిద్ధమైంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏ స్థాయిలో ఉండబోతుందో రుచి చూపించేందుకు ఒక ప్రోమో విడుదలైంది. ఎప్పటిలాగే దుమ్మురేపే డ్యాన్సులతో కంటెస్టెంట్లు, కావాల్సినంత కామెడీతో టీమ్‌లీడర్లు పోటీపడ్డారు. యాంకర్‌ ప్రదీప్‌ వార్డెన్‌గా ఉన్న హాస్టల్‌లో టీమ్‌లీడర్లు, కంటెస్టెంట్లు జాయిన్‌ కావడానికి వస్తారు. వాళ్ల వివరాలు తెలుసుకునే క్రమంలో.. రష్మీని పేరు, వయసు అడగ్గా.. తన పేరు రుచి అని.. వయసు 16 అని చెప్తుంది.. వెంటనే ‘పదహారు ఒకట్లా.. లేక పదహారు రెండ్లా..?’ అని ప్రదీప్‌ పంచ్‌ వేస్తాడు. పక్కనే ఉన్న సుధీర్‌ ఊరుకుంటాడా.. ‘పదహారు మూళ్లు వేసిన తప్పు లేదు‌’ అనడంతో పాపం రష్మీ బిక్కమొహం వేసుకుంటుంది. ఆ తర్వాత హాస్టల్‌లో ఉండే మెనూ చెప్తాడు ప్రదీప్‌. ఆ మెనూ విన్న కింగ్స్‌ లీడర్లు, పోటీదారులు అవాక్కవుతారు.

నైనికను ఉద్దేశిస్తూ సాయి చేసిన లవ్‌ పప్రోజల్‌ డ్యాన్స్‌ ఆకట్టుకునేలా ఉంది. ఆఖర్లో పూర్ణ భావోద్వేగానికి గురికావడంతో ప్రియమణి ఓదార్చే ప్రయత్నం చేసింది. పూర్ణ మాత్రం దుఖాన్ని ఆపుకోలేక బోరున విలపించింది. ఈ పూర్తి ఎపిసోడ్‌ ఆగస్టు 18న ‘ఈటీవీ’లో ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి. ఈ కార్యక్రమంలో కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌ మధ్య డ్యాన్స్‌ హోరాహోరీగా పోటీ నడుస్తోంది. క్వీన్స్‌ టీమ్‌ లీడర్లుగా రష్మీ, దీపిక వ్యవహరిస్తుండగా.. కింగ్స్‌ టీమ్‌ లీడర్లుగా సుధీర్‌, ఆది ఉన్నారు. యాంకర్‌గా ప్రదీప్‌ అలరిస్తున్నాడు. న్యాయనిర్ణేతలుగా ప్రియమణి, గణేశ్‌మాస్టర్‌, పూర్ణ వ్యవహరిస్తున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని