స్వీటీతో ఆర్‌.ఆర్‌.ఆర్‌ అంకుల్స్‌.. వీళ్ల మధ్యలో ఏం జరిగింది..?  - crazy uncles official trailer sreemukhi raja ravindra
close
Published : 14/08/2021 23:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వీటీతో ఆర్‌.ఆర్‌.ఆర్‌ అంకుల్స్‌.. వీళ్ల మధ్యలో ఏం జరిగింది..? 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలంటుంటారు. కానీ.. కొంతమంది మాత్రం కాస్త ఆలస్యంగా మేల్కొని ఎప్పుడో చేయాల్సిన పనులు ఇంకెప్పుడో చేస్తుంటారు. ఈ ‘క్రేజీ అంకుల్స్‌’ పరిస్థితి కూడా అదే. ఓ అపార్టుమెంటులో ఉండే ఆర్‌,ఆర్‌,ఆర్‌ (రాజు.. రెడ్డి.. రావు) ముగ్గురూ మధ్యవయస్కులు.. తాము కుర్రతనంలో చేయలేకపోయిన చిలిపి పనులు ఇప్పుడు చేద్దామని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఒక అందమైన అమ్మాయి స్వీటీ (శ్రీముఖి) వెంట పడతారు. ఎలాగైనా ఆమెను లైన్లో పెట్టాలని తాపత్రయపడుతుంటారు. ఆ తర్వాత వాళ్లు ఉండే అపార్టుమెంటులోకే ఆ అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో ముగ్గురికి చెమటలు పడతాయి. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేదే మిగతా కథ. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బుల్లితెర తార శ్రీముఖి ప్రధానపాత్రలో కనిపిస్తుండగా.. క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, గిరిధర్‌, అదుర్స్‌ రఘు, హేమ తదితరులు నటించారు. 


 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని