దున్నతో భళ్లాలదేవుడి ఫైట్‌.. ఇలా తీశారు! - baahubali bison tau films vfx breakdowns
close
Updated : 27/03/2021 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దున్నతో భళ్లాలదేవుడి ఫైట్‌.. ఇలా తీశారు!

ఇంటర్నెట్‌డెస్క్‌: విజువల్‌ వండర్‌గా యావత్‌ సినీ ప్రపంచాన్ని సంభమాశ్చర్యాలకు గురి చేసిన చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు ఖ్యాతిని ప్రపంచ యవనికపై నిలిపింది. ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్క, నాజర్‌, తమన్నా, సత్యరాజ్‌ల నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇక మాహిష్మతి సామ్రాజ్యం, కుంతల రాజ్యం, కాలకేయులతో యుద్ధ సన్నివేశాలు థియేటర్‌లో చూస్తుంటే ప్రేక్షకులకు రెండు కళ్లూ సరిపోలేదంటే అతిశయోక్తి కాదు.

ఏది నిజమో.. ఏది విజువల్‌ ఎఫెక్ట్‌ సన్నివేశమో తెలియనంతగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దీన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా దర్శకుడి ఊహకు తగిన విధంగా వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు శ్రీనివాసమోహన్‌ అందించిన సన్నివేశాలు సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. ముఖ్యంగా భళ్లాల దేవుడు.. అడవి దున్నతో ఫైట్‌ చేసే సీన్‌ గగుర్పాటు కలిగిస్తుంది. ఆ సన్నివేశాలను ఎలా తెరకెక్కించారో మీరూ చూసేయండి.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని