ఆదిసాయికుమార్‌ కొత్త సినిమా షురూ.. రేపట్నుంచి షూటింగ్‌ - aadisaikumar new film tmk kickstarted today with pooja ceremony
close
Published : 15/08/2021 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదిసాయికుమార్‌ కొత్త సినిమా షురూ.. రేపట్నుంచి షూటింగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు ఆది సాయికుమార్‌ టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నాడు. ఇప్పటికే చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. ఇదిలా ఉండగా.. మరో కొత్త సినిమా పనులు ప్రారంభించాడు. కల్యాణ్‌ జీ గోగన దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఆది సరసన పాయల్‌ రాజ్‌పూత్‌ సందడి చేయనుంది. కమెడియన్‌ సునీల్‌, పూర్ణ తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. నాగం తిరుప‌తిరెడ్డి నిర్మాత‌. సాయి కార్తీక్ సంగీతం అందించ‌నున్నారు. ఈ సినిమా తొలి పూజా కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆగస్టు 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఆది నటిస్తోన్న ‘బ్లాక్‌’ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటోంది. దీంతో పాటు ‘కిరాతక’ ఫస్ట్‌లుక్‌ కూడా అభిమానులతో పంచుకున్నాడీ యువ హీరో. ఆ సినిమాకు వీరభద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు బ‌ల‌వీర్ ద‌ర్శక‌త్వంలో ఆది మరో సినిమా చేస్తున్నాడు. ‘అమ‌ర‌న్’ పేరుతో ఆ చిత్రం లాక్‌డౌన్‌కి ముందే సెట్స్‌పైకి వెళ్లింది. అందులో అవికా క‌థానాయిక‌. ఆది ఆ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని