ప్రభాస్‌ బుల్లి వీరాభిమాని ఈ బుడతడు..! - a three year old boy is a big fan of prabhas
close
Published : 11/02/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ బుల్లి వీరాభిమాని ఈ బుడతడు..!

మూడేళ్ల వయస్సులోనే వందసార్లు బాహుబలి వీక్షించాడు..

హైదరాబాద్‌: ‘బాహుబలి’.. జక్కన్న చెక్కిన ఈ అపురూప చిత్రంతో ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఓ బుడతడు సైతం ‘బాహుబలి’కి వీరాభిమానిగా మారాడు. మూడేళ్ల వయస్సులోనే 100 సార్లు ‘బాహుబలి’ చిత్రాన్ని వీక్షించాడు. ఈ విషయాన్ని ఆ చిన్నారి తల్లి సోషల్‌మీడియా వేదికగా తెలియజేసింది.

న్యూయార్క్‌లో ఉంటున్న సుప్రియా దోషి అనే మహిళ తాజాగా అమరేంద్ర బాహుబలి గెటప్‌లో ఉన్న తన మూడేళ్ల బాబు ఫొటోని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. ‘‘ప్రభాస్‌.. న్యూయార్క్‌లో మీకో వీరాభిమాని ఉన్నాడు! మూడేళ్ల వయస్సులోనే 100సార్లు మీ ‘బాహుబలి’ చిత్రాన్ని వీక్షించాడు. మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలనేది నా చిన్నారి కోరిక’’ అని సుప్రియ పేర్కొంది. సుప్రియ పెట్టిన ట్వీట్‌ చూసిన రెబల్‌స్టార్‌ అభిమానులు.. ‘బుడతడు క్యూట్‌గా ఉన్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ‘లిటిల్‌ బాహుబలి’  పేరుతో ఈ చిన్నారికి ప్రత్యేకంగా ఓ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కూడా ఉంది. ‘బాహుబలి’ పాటలు పాడుతూ, డైలాగులు చెబుతూ.. చిన్నారి పొందిన ఆనందాన్ని వీడియోలుగా రూపొందించి సుప్రియ ఆ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇవీ చదవండి

పుష్ప షూట్‌.. నాలుగు గంటలే నిద్ర: రష్మిక

సలార్‌.. ఒక మెట్టెక్కాం!
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని