ప్రభాస్‌తో మరో ప్రాజెక్ట్‌ చేస్తా: రాజమౌళి - Rajamouli On Work With Prabhas Again
close
Published : 03/12/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌తో మరో ప్రాజెక్ట్‌ చేస్తా: రాజమౌళి

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌-దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘బాహుబలి’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా రికార్డులూ సృష్టించింది. ‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌-రాజమౌళి ఎవరి ప్రాజెక్ట్‌లతో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే, వీరిద్దరి కాంబినేషన్‌ మరో సినిమా వస్తే చూడాలని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో కలిసి మరోసారి పనిచేయడంపై తాజాగా రాజమౌళి స్పందించారు. ‘‘బాహుబలి’ కోసం ఐదేళ్లు కలిసి పనిచేయడం వల్ల మా మధ్య అనుబంధం మరింత పెరిగింది. అయితే, మా ఇద్దరిలో ఆసక్తి రేకెత్తించే కథ సిద్ధమైతే.. తప్పకుండా మేమిద్దరం మరోసారి కలిసి పని చేస్తాం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తారక్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రానున్న ‘ఆర్‌ఆర్ఆర్‌’ని ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తయ్యింది. మరోవైపు ప్రభాస్‌ కథానాయకుడిగా ‘రాధేశ్యా్‌మ్‌’ రూపొందుతుంది. కె.రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. దీనితోపాటు ఆయన ‘ఆదిపురుష్‌’, నాగ్‌ అశ్విన్‌ సినిమాలో నటించనున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని