ఆర్జీవీ ఛాయిస్‌ మేము కాదు: ఊర్మిళ - Nagarjuna Sridevi and Rajinikanth were the first choices for RGV
close
Published : 20/09/2020 19:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్జీవీ ఛాయిస్‌ మేము కాదు: ఊర్మిళ

ముంబయి: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘రంగీలా’. జాకీ ష్రాఫ్‌, ఊర్మిళ, అమీర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే ‘రంగీలా’ విడుదలై ఈ ఏడాదితో 25 సంవత్సరాలైన సందర్భంగా నటి ఊర్మిళ సదరు సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘రంగీలా’  తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమన్నారు. అంతేకాకుండా ‘రంగీలా’ చిత్రంలో నటించే అవకాశం అనుకోకుండా తనని వరించిందని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

‘‘రంగీలా’ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నప్పుడు ఆర్జీవీ ఛాయిస్‌ మొదట్లో మేము కాదు. తెలుగు హీరో నాగార్జున, హీరోయిన్‌ శ్రీదేవి, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ‘రంగీలా’ రూపొందించాలని భావించారు. అనుకోని కారణాల వల్ల రజనీకాంత్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అలాగే శ్రీదేవి కూడా ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని వదులుకున్నారు. అనంతరం కథకు సరిపోయే నటీనటుల కోసం ఎంతో ప్రయత్నించారు. అలాంటి సమయంలో నాతోపాటు జాకీష్రాఫ్‌, అమీర్‌ఖాన్‌కి ఈ సినిమా అవకాశం వచ్చింది’ అని ఊర్మిళ తెలిపారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని